Horoscope Today: వీరికి అష్టమ చంద్ర దోషం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Jul 21, 2022 | 6:36 AM

Horoscope Today (21-07-2022): మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక శుభకార్యాల విషయంలో అయితే వెనకా ముందు చూసుకుని మరీ ప్రణాళికలు వేసుకుంటారు. అంతెందుకు ఉదయం లేవగానే

Horoscope Today: వీరికి అష్టమ చంద్ర దోషం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

Horoscope Today (21-07-2022): మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక శుభకార్యాల విషయంలో అయితే వెనకా ముందు చూసుకుని మరీ ప్రణాళికలు వేసుకుంటారు. అంతెందుకు ఉదయం లేవగానే తమ రాశిఫలాలు ( Daily Horoscope) చూసుకునే వారు చాలామంది ఉంటారు. అనుకూల సమయాలు చూసుకుని మరీ పనులు మొదలుపెడతారు. మరి జులై 21(గురువారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రమతోనే సానుకూల ఫలితాలు. అవవసర కలహాలు, గొడవలు. ధనవ్యయం. స్థిరమైన ఆలోచనలు ఉండవు. శత్రువులకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే శుభం కలుగుతుంది.

వృషభం
కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. చేపట్టిన రంగాల్లో వైఫల్యాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు దాపరిస్తాయి. గణపతి స్తోత్రము జపిస్తే మంచి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం
అస్థిర నిలయాలు, ఆలోచనలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో సఖ్యతతో వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం
కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. శారీరక శ్రమ, ధనవ్యయం పెరుగుతుంది. వివాదాలు, గొడవలకు దూరంగా ఉండడం ఉత్తమం

సింహం
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక విషయాల్లో ఆత్మీయుల సలహాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులు, బంధువుల పట్ల ప్రేమతో మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి దేవుడిని పూజిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

కన్య
ఈరాశివారికి అష్టమ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మనోబలం కోల్పోకూడదు. దుర్గా అష్టోత్తర శతనామావళి జపిస్తే శుభం కలుగుతుంది.

తుల
వీరు శుభకార్యాలు, విందులు వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. అవసరానికి ఆదుకునే ఆత్మీయులు ఉండడం అదృష్టం. ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. సూర్యాష్టకం పఠిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

వృశ్చికం
కీలక వ్యవహారాల్లో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బిల్వాష్టకం జపిస్తే శుభప్రదం

ధనస్సు
కుటుంబీకులు, బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆత్మీయుల సహకారం లాభిస్తుంది.

మకరం
వృత్తి, ఉద్యోగ,వ్యాపార రంగాల్లో ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకులు, బంధు, మిత్రులతో
సఖ్యతతో వ్యవహరించాలి. దుర్గాదేవిని పూజిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

కుంభం
ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

మీనం
కుటుంబీకులు, బంధు,మిత్రుల సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక వ్యవహారాల్లో తొట్రుపాటు నిర్ణయాలు వద్దు. ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. సంకటహర గణపతి స్తోత్రం జపిస్తే సానుకూల ఫలితాలు అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..