Horoscope Today: వీరికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.. నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Feb 27, 2022 | 7:19 AM

Horoscope Today (27-02-2022): కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు...

Horoscope Today: వీరికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.. నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

Horoscope Today (27-02-2022): కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 27 వ తేదీ ) శనివారం (sunday) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషం

ఈ రాశి వారికి ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృషభం

ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనః పీడ పెరుగుతుంది. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

మిథునం

ఈ రాశి వారికి శుభఫలాలు అందుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యం తో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్నిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలుంటాయి.

కర్కాటకం

కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. చంచంలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పొదుపు పాటించాలి. స్థానచలన సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి.

సింహం

ఈ రాశి వారికి సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లాభంలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది. చంచంలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.

కన్య

ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.

తుల

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికం

ఈ రాశి వారికి సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనుస్సు

తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభ వార్త ఆనందాన్నిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రసంశలు పొందుతారు. ప్రయాణాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు.

మకరం

ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

కుంభం

చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మీనం

ఈ రాశి వారికి తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు.