
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను లేదా బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలను చాలావరకు అధిగమించి, లాభాలు పొందుతారు. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కానీ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం పొందుతారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు సజావుగా సాగిపో తాయి. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగి పోతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా, ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. దగ్గర బంధువుల రాక పోకలుంటాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కు తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెడతారు. పెద్దల నుంచి సహాయ సహకా రాలుంటాయి. వ్యక్తిగత సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు మీ మీద నమ్మకం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యూహాలతో వ్యాపారాలు పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా సానుకూలపడతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. సప్తమ శని ప్రభావం వల్ల కొద్దిపాటి స్వల్ప అనారోగ్యాలతో ఇబ్బంది పడడం, పనులు ఆలస్యం కావడం వంటివి జరుగుతాయి. ధనపరంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సమాజంలో కూడా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు సునాయాసంగా పూర్తవు తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేసి, లబ్ధి పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణి స్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుప డుతుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేసి ఊరట చెందుతారు. ఏ విషయంలోనైనా యత్న కార్యసిద్ధి ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా పురోగతి సాధిస్తారు. ప్రేమలు సాఫీగా సాగి పోతాయి.
వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాల్లో కొద్ది పాటి లాభాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. విద్యార్థులు శుభవార్తలు తెస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. మంచి గుర్తింపు ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలకు అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగుతాయి.
ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. ప్రేమల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవ హారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయ త్నాలు కలిసి వస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలుంటాయి. బంధువులతో మాట పట్టింపులు తలె త్తుతాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులుంటాయి.