Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేదానిపై దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. జనవరి 18 (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
వృషభ రాశి:
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశి:
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొందరు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి:
మనోధైర్యంతో ముందుకెళ్లాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరరిస్థితులు సానుకూలగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహ రాశి:
వృత్తి, ఉద్యోగ రంగాల వారు రాణిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ధన లభం కలిగే అవకాశాలున్నాయి.
కన్య రాశి:
ప్రారంభించిన పనిలో సంతృప్తి ఉంటుంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
తుల రాశి:
ఓ వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి.
వృశ్చిక రాశి:
ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముందస్తుగా జాగ్రత్త పడటం మంచిది. చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి:
తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి.
మకర రాశి:
ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కుంభ రాశి:
చిత్తశుద్దితో పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారరాలలో లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.
మీన రాశి:
ప్రాంభించిన పనులలో మంచి ఫలితాలు పొందుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి: