Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ఇక వారం మొత్తంలో తమతమ రాశి ఎలా ఉంటుందని తెలుసుకుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. ఫిబ్రవరి 24 (గురువారం)న రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ధైర్యంతో ముందుకెళితే విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇతరుల సలహాలు పొందుతారు.
మిథున రాశి:
ఓ శుభవార్త వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి:
చేపట్టే పనులలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
సింహ రాశి:
చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందుకెళ్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
కన్య రాశి:
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
తుల రాశి:
ఇతరుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేపడతారు.
వృశ్చిక రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్థులకు మంచి లాభాలు ఉంటాయి. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ధనుస్సు రాశి:
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కొందరి ప్రవర్తిన మిమ్మల్ని బాధకలిగిస్తుంది. సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి:
పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి.
కుంభ రాశి:
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి.
మీన రాశి:
చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకెళితే విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇవి కూడా చదవండి: