Horoscope: అబ్బబ్బ.! ఏం కిక్కు ఉంది.. వీరు పట్టుకుందల్లా బంగారమే.. ఒక్క చిన్న సమస్య..

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. 

Horoscope: అబ్బబ్బ.! ఏం కిక్కు ఉంది.. వీరు పట్టుకుందల్లా బంగారమే.. ఒక్క చిన్న సమస్య..
Daily Horoscope

Edited By:

Updated on: Apr 27, 2026 | 6:28 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసు కుంటే అంత మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలుంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందు తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. కుటుంబ జీవితం సాదా సీదాగా గడిచిపోతుంది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి శ్రమ, తిప్పట ఉంటాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. సహోద్యోగులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. చిన్న నాటి మిత్రుల్ని కలుసుకుని, ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.  నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాల్ని అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు  విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఏ మాత్రం విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొన్ని మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో పెద్దగా సమస్యలేవీ ఉండకపోవచ్చు. ఆదా యానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతి ఫలం ఉంటుంది. కొందరు బంధువులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.  విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొత్త బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపో తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడంతో చిన్నా చితకా ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు.బంధు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువవుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగి పోతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలుంటాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు చదువుల మీద కొద్దిగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలను అధికారులు గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఇతరుల విషయాల్లో కల్పించుకుని ఇరకాటంలో పడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొందరు మిత్రుల సహా యంతో ముఖ్యమైన వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారానికి వెళ్లే అవకాశం ఉంది. పిల్లలు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వైద్య ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫ లమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఉద్యోగంలో ప్రతిభకు, శ్రమకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. నిరుద్యోగు లకు తతిన ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది.  సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి వల్ల విశ్రాంతి తగ్గుతుంది.  వ్యాపారాల్లో రాబడికి ఆశించినంతగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.  ఉద్యోగం మారడానికి సమ యం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి లోటుండదు.  అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. మిత్రులు ఆర్థిక సహాయం కోసం బాగా ఒత్తిడి చేస్తారు.

Follow Us