Horoscope Today: ఆ రాశుల వారందరికీ వ్యతిరేక ఫలితాలే.. శుక్రవారం రాశి ఫలాలు ..

Rasi Phalalu 30th april: చాలాసార్లు మనకు అవసరం లేని విషయాల్లో కూడా మనం తల దూర్చడానికి ప్రయత్నించి ఇబ్బందులను ఎదుర్కొంటుంటాం. మంచి చేయబోతే చెడు

Horoscope Today: ఆ రాశుల వారందరికీ వ్యతిరేక ఫలితాలే.. శుక్రవారం రాశి ఫలాలు ..

Updated on: Apr 30, 2021 | 7:53 AM

Rasi Phalalu 30th april: చాలాసార్లు మనకు అవసరం లేని విషయాల్లో కూడా మనం తల దూర్చడానికి ప్రయత్నించి ఇబ్బందులను ఎదుర్కొంటుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలే చిన్నాభిన్నం అవుతాయి. పైగా పలు సమస్యలు కూడా ఎదురవుతాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. శుక్రవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి సమయం అనుకూలంగా ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి పరిశీలిద్దాం..

మేషం: ఈ రాశి వారు ఈ రోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను దగ్గరుండి పూర్తిచేయగలుగుతారు. వ్యాపార విషయాల్లోల ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. నవగ్రహ అర్చన, ప్రదక్షిణ మేలు చేస్తుంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈరోజు వేరువేరు రూపాల్లో చేపట్టినటువంటి పనులు విజయవంతమవుతుంటాయి. వ్యాపార ఉద్యోగాల విషయాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. లలితా అమ్మవారి దర్శనం శుభ ఫలితాలను కలుగజేస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు అప్పులు చేసే ప్రయత్నాల్లో ఉంటుంటారు. తగిన నిర్ణయాలు, సమయాల కోసం వేచి చూస్తుంటారు. ఆంజనేయస్వామికి తమలపాకులను సమర్పణ చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం కనిపిస్తోంది. పలు రకాల కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శివాభిషేకం మేలు చేస్తోంది.

సింహ రాశి: ఈ రాశివారు ఈ రోజు పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కొద్ది పాటి లాభాలు వివాదాలు కూడా ఉంటుంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సుదర్శణస్వామి వారి నామస్మరణ మేలు చేస్తుంది.

కన్యా రాశి : ఈ రాశివారు చేపట్టే పనులు కొన్ని మాత్రమే ఆలస్యమవుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విష్ణు పూజ మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబసభ్యుల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వరస్వామి అర్చన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి. అలాగే ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. గణపతి అర్చన మేలు చేస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి విజయాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో విబేధాలు తొలగించుకోవడం మంచిది. లక్ష్మీనృసింహా స్వామి వారి అర్చన మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారిక విషయాలు కొంత నిరుత్సాహ పరుస్తుంటాయి. కుటుంబసభ్యులతో వివాదాలు తొలగించుకోవడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి వ్యక్తిగత పనుల్లో ఆలస్యం ఏర్పడుతుంది. ఇంటా, బయట నిరుత్సాహం కలుగుతుంది. దుర్గా సప్తశ్లోకి పారయణం మేలు చేస్తుంది. అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఉంటుంటాయి. సరైన ప్రోత్సాహకాలు కూడా లభించవు. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us