దిన ఫలాలు (మార్చి 29, 2024): మేష రాశి వారికి శుక్రవారంనాడు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులు అధికారులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశికి చెందిన వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి లోటుండదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత వాహన ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో తప్పకుండా పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఆశాజనకంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర, సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కొందరు మిత్రుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయ వద్దు. రావలసిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. సొంత పనుల మీదా, సొంత వ్యవహారాల మీదా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల నుంచి వస్తు లాభాలు అందుతాయి. గృహ, వాహనాల విషయంలో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా, నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఒకటి రెండు మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఇంటా బయటా అదనపు బాధ్యతలుంగాయి. శరీరానికి విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. పొదుపు చర్యల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్ని హిత్యం పెరుగుతాయి. శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపో తాయి. కొన్ని కీలక నిర్ణయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు పీడిస్తాయి. కుటుంబ సభ్యులతో సామ రస్యంతో వ్యవహరించడం మంచిది. వ్యాపార లావాదేవీలు పరవాలేదనిపిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
బంధుమిత్రులతో విందులు, శుభ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగావకాశాలు అందుకుంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతు లకు అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారి రాబడి బాగా పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం తప్ప ప్రయోజనం ఉండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం జరుగుగుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యా ఉండదు. నూతన వస్తు లాభాలు పొందుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచ నలున్నాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో మీ పనితీరుకు, ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఇష్టమైన బంధువులతో ఎంజాయ్ చేస్తారు. ఆశించిన విధంగా వ్యాపా రాలు రాణిస్తాయి. మంచి లాభాలు గడిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. అవసరాలు తీరిపో తాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణముం టుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.