Telugu News Astrology Horoscope today 24th May 2023 Astrological predictions for all zodiac signs in telugu
Horoscope Today: వారిని సన్నిహితులు స్వార్థంకోసం వాడుకుంటారు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..
Horoscope Today (24 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Horoscope Today (24 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం చాలా అవసరం. ఉద్యోగులు తమ తమ రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారపరంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ఒకరిద్దరి మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగులు స్థిరత్వం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితం లో బాగా నైపుణ్యం సాధిస్తారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు వెళుతుంది. ఆరోగ్యపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చ వద్దు. బంధుమిత్రులు మీ సలహాలను, సూచనలను పాటిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ పరంగా ఆర్థికపరంగా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. దనపు ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి శుభవార్త అందుతుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. మీ మనసులోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. పుష్యమి నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ఆదరిస్తారు. వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. పిల్లలు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. బంధువుల నుంచి మాట వస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాట చలామణి అవుతుంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది. ఒకరిద్దరు బాగా సన్నిహితులు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరికైనా వాగ్దానం చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సహచరులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటి నిపుణులు అభివృద్ధి చెందే సూచనలున్నాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీగా ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వేగంగా వాహనాలను నడపటం మంచిది కాదు. ఆరోగ్యం పర్వాలేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి.చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్నేహితుల సహకారంతో ఒకటి రెండు వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగ పరంగా, ఆర్థికంగా చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. సమాజంలో విలువ పెరుగుతుంది. గౌరవ సత్కారాలు చోటు చేసుకుంటాయి. అధికారులకు మీ సూచనలు సూచనలు సలహాలు సలహాలు ఉపయోగపడతాయి. కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి లోపిస్తుంది. పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలలో సరదాగా కాలక్షేపం చేస్తారు. డబ్బు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలోనూ, బంధు వర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. మారటానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఐటీ నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మీద ఒక కన్నువేసి ఉండటం మంచిది. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో బిజీ అయిపోతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ కి కూడా అవకాశం ఉంది. ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు వెళతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తోంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. రుణ బాధ చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)