Horoscope Today: అన్ని రోజులు మనవి కావు అని పెద్దలు చెబుతుంటారు. అంతా అనుకూలంగా కనిపిస్తున్నా కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రాదు. కొన్నిసార్లు మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కాబట్టి మనం చేసే పనులైనా, తీసుకునే నిర్ణయాలైనా ఆచితూచి తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో రాశి ఫలం ఆధారంగా మనం చేపట్టబోయే పనుల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకుని దానికి తగ్గ పరిహారాలు పాటిస్తూ, పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి సోమవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి చూసేయండి.
గౌరవ మర్యాదలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పేదవారికి అన్నదానం శుభాలను కలగజేస్తుంది. అంతేకాకుండా గణపతి దర్శనం కూడా మీకు శుభాలను అందజేస్తుంది.
రావాల్సిన బకాయిల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అష్టలక్ష్మీ శ్రోత పారాయణం మేలు చేస్తుంది.
కుటుంబ సభ్యుల గురించి మధనపడుతుంటారు. ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గా పూజ మేలు చేస్తుంది.
ఆహర విహారాధుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వేరువేరు సందర్భాల్లో ఇబ్బందికరమైన భోజనాలకు దూరంగా ఉండటం మేలు. శివారాధన శుభాలను కలగజేస్తుంది.
వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మేలు చేస్తుంది.
షేర్లు, పెట్టుబడుల విషయంలో నిధానం అవసరం. ఏమాత్రం కూడా తొందరపడకూడదు. శక్తికి మించిన హామీలను ఇచ్చి ఇబ్బందిపడకండి. మహాగణపతి దర్శనం, గరిక పూజ మేలు చేస్తుంది.
మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయపరమైన ఒడిదుడుకులను అధిగమించే ప్రయత్నంలో శుభాలను పొందుతారు. నారాయణ అష్టాక్షరి జపం మేలు చేస్తుంది.
ఆరంభం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ నెమ్మదిగా శుభ ఫలితాలను పొందుతారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ సుక్త పారాయణ మేలు చేస్తుంది.
దూర ప్రాంతాలకు ప్రయాణం. విదేశీ చదువుల విషయాల్లో ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటారు. హయగ్రీవ స్తోత్రం పటించడం మంచిది.
మాట విలువ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్‌కు సంబంధం ఉన్న వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
వ్యక్తిగతమైన సమస్యలను సరి చేసుకుంటారు. శత్రువులపై ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన మేలు చేస్తుంది.
ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాంఘిక, జనసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధన శుభ ఫలితాలను కలగజేస్తుంది.
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!