Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

|

Jan 22, 2022 | 6:25 AM

Horoscope Today (22-01-2022): రోజు మొదలు పెట్టె ముందు లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఈరోజు ఎలా ఉంటుంది.. అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

Horoscope Today (22-01-2022): రోజు మొదలు పెట్టె ముందు లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఈరోజు ఎలా ఉంటుంది.. అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 22 వ తేదీ ) శనివారం (Saturday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార రంగంలోని వారు లాభాలను అందుకుంటారు.  చేపట్టిన పనులు కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు పెద్దల అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్దితి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులతో అధిక వ్యయం చేస్తారు. సంకల్ప బలంతో పనులు నెరవేర్చుకుంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు. అందరి ప్రశంసలను అందుకుంటారు. నూతన వస్తువులు, బట్టలు కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా ధన లాభం పొందుతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారస్తులు తమ ఆలోచనలు ఎదుటివారితో పంచుకుంటే మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు తీసుకునే స్థిరనిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాలోని వారు అనుకూల ఫలితలను పొందుతారు. ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఇష్టమైన వారితో గడుపుతారు. ముఖ్యమైన పనులను చేసే ముందు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నూతన వస్తువులను ఖరీదు చేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తను వింటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఈ రోజు అధిక శ్రమకు గురవుతారు. ఆవేశంలో నిర్ణయాలను తీసుకోకూడదు. అందరినీ కలుపుకుని వెళ్ళడం వలన సమస్యలు తగ్గుతాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో సలహాలతో చేపట్పటిన పనుల్నులో విజయం సొంతం చేసుకుంటారు. విందు వినోదకార్లుయక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో గడుపుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ అధికమవుతుంది. బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్ధికంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర భయాందోళనలకు గురవుతారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు ఏపీ గవర్నర్ కు చిన్నజీయర్ స్వామి తరుపున భక్తబృందం ఆహ్వానం