Horoscope Today: వారి వ్యక్తిగత సమస్యలను పరిష్కారం..12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Oct 21, 2023 | 5:01 AM

దిన ఫలాలు(అక్టోబర్ 21, 2023): మేష రాశి వారికి  లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మిథున రాశికి చెందిన నిరుద్యో గులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి వ్యక్తిగత సమస్యలను పరిష్కారం..12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 21st October 2023
Follow us on

దిన ఫలాలు(అక్టోబర్ 21, 2023): మేష రాశి వారికి  లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మిథున రాశికి చెందిన నిరుద్యో గులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. మిత్రుల సాయంతో ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు లాభాలు పండిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సాను కూల స్పందన ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ రంగానికి చెందినవారికైనా అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యో గులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమయ స్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడ తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితముంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవు తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా సీదా సాదాగా గడిచిపోతుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అధి కారులతో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం మంచిది. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకోకుండా ఒకటి రెండు శుభ యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగు లకు శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశివారికి ఈ రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఉన్న ప్పటికీ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమ స్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు బాగా ఆలస్యం అవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా ఆనందంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. ముఖ్యంగా బంధుమిత్రులకు అండగా నిల బడతారు. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితా లుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్య మైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.