Horoscope Today (19-01-2022): మనిషి జీవితం నమ్మకం ఆధారంగా ముందుకు సాగుతుంది. నేటికీ చాలా మంది ఏ పని మొదలు పెట్టాలన్నా .. శుభకార్యాలు, ప్రయాణాలు వంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 19 వ తేదీ ) బుధవారం (Wedness day) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్బంత పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వృత్ధుతిలో ఇబ్బందులను అధిగమించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు హాని చేసే పనులను మానుకోవడం వలన మేలు జరుగుతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులకు మేలు చేసే విధంగా నడుకుంటారు. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అన్ని విధాల మేలు. శారీరక మానసిక ఇబ్గాబందులకు గురవుతారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అధిక ధన వ్యయం చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. గతంలో తీసుకున్న అప్పులను తీరుస్తారు. మానసికంగా ఆనందం పొందుతారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగాలోని వారికి అనుకూల ఫలితాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. శుభవార్త వింటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు పరిచయం లేని వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురై ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు వృధా ప్రయాణాలను అధికంగా చేస్తారు. చేపట్టిన పనులతో స్వల్ప మేర లాభం పొందుతారు. వ్యాపార రంగంలో లాభాలను పొందుతారు. కొత్తపనులను ప్రారంభిస్తారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆవేశానికి గురికాకుండా ఉండడం మంచిది. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. మనసికంగా ఆందోళనకు గురవుతారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. స్త్రీ వలన ధనలాభం కలుగుతుంది. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
మీన రాశి: ఈరోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఎదురయ్నుయే ఇబ్బందులను అధిగమిస్తారు. ఆకస్మిక ధన నష్టసం కలిగే అవకాశం ఉంది. స్త్రీల వలన సమస్యలు ఎదుర్కొంటారు.
Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.
Also Read: స్వల్పంగా దిగివచ్చిన పసిడి.. పరుగులు పెట్టిన వెండి.. దేశంలో ముఖ్య నగరాల్లో నేటి ధరలు…