దిన ఫలాలు (సెప్టెంబర్ 17, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండదు కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కు వగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆదాయానికి లోటుండదు కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన ఆల యాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగి ఇబ్బందిపడతారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదన్నట్టుగా ఉంటుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. అధికా రులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వ్యవహా రాల్లో తల్లితండ్రుల అండదండలు లభిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్త్రాభరణాలు, విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచ యాలు విస్తృతం అవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన స్థాయిలో సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో. శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు సాయం చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య మైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. మిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి పెరుగు తుంది. ఆదాయ మార్గాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. పోటీదార్ల సమస్యలు బాగా తగ్గిపో తాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ముఖ్యమైన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభసాటిగా జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. కొద్ది శ్రమతో పనులు, వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. జీతభత్యాలకు సంబం ధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు విదే శాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా ఆదాయం బాగా వృద్ది చెందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు, పను లన్నీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపో వచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలతలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరించడా నికి ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో వీలైనంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నా ఫలితం ఉంటుంది. నిరుద్యోగు లకు సమయం అనుకూలంగా ఉంది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
పెళ్లి ప్రయత్నాలు లేదా ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. తల్లితండ్రుల జోక్యంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు, పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. రుణ భారం నుంచి చాలావరకు బయటపడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది సరైన సమయం. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. రావలసిన సొమ్మంతా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.