16th December Horoscope: దిన ఫలాలు (డిసెంబర్ 16, 2023): మేష రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి వ్యక్తిగత సమస్యలకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక మిథున రాశి వారికి అటు వృత్తి, ఇటు వ్యాపారంలోనూ అనుకూలంగా మారుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
వృత్తి, వ్యాపారాలలో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కొందరు స్నేహితుల వల్ల బాగా ఇబ్బందులు పడతారు. ముఖ్య మైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలను తగ్గించుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలను కార్యరూపంలో పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులు వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. చిన్ననాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేయడం జరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. సతీమణితో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృత్తి, వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితా లనిస్తాయి. అయితే, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది. మిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అను కూలంగా ఉంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధువుల తీరు ఇబ్బంది పెడు తుంది.
ఆర్థిక పరి్స్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొని ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహా రాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగు తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కొన్ని ప్రయత్నాలతో కార్యసిద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కొందరు బంధువుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యు లతో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.
వృత్తి, ఉద్యోగాలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆధ్యా త్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒకరిద్దరు మిత్రులను ఆదుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులు, వినోదాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. విదేశాల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.
శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది.
వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి ఆదాయ ప్రయత్నమూ కలిసి వస్తుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, మద్య వ్యాపా రులు బిజీ అయిపోతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థిక స్తోమతకు మించి స్నేహితులకు సహాయపడతారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదా యంలో పెరుగుదల ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయా ణాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొందరు మిత్రు లతో కాలక్షేపం చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.