Horoscope Today On June 10th 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 10న) గురువారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి..
ఈరోజు వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుడదు. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృషభ రాశి..
ఈరోజు వీరికి సాంఘిక పరమైన ఒత్తిళ్లు, ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుండాలి. శివారాధన మేలు చేస్తుంది.
మిథున రాశి..
ఈరోజు వీరికి సేవక జనం సహాకారం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత కుదుటపడే అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు విలువైన వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గృహా సంబంధమైన ఆలోచనలు బలపడుతుంటాయి. విశేషమైన కార్తీవీర్య అర్జున్ నామస్మరణ మేలు చేస్తుంది.
సింహ రాశి..
ఈరోజు వీరు విలువైన కార్యక్రమాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. దుబార ఖర్చులు నియంత్రించుకోవాలి. అష్ట లక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్య రాశి..
ఈరోజు వీరు మాతృ వర్గీయులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. పెద్ద వారి ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడూ వైద్యుల సలహాలు తీసుకోవాలి. శివాలయం దర్శనం మేలు చేస్తుంది.
తులా రాశి..
ఈరోజు వీరు ప్రణాళికబద్ధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు పొందగల్గుతారు. విష్ణు సహస్ర నామ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు విలువైన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. గణపతి దర్శనం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరు అనుకోని ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. సుదర్శన స్వామి నామ స్మరణ మేలు చేస్తుంది.
మకర రాశి..
ఈరోజు వీరు వేరు వేరు రూపాల్లో ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. విద్యల వలన గౌరవాన్ని పెంచుకుంటారు. లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభ రాశి..
ఈరోజు వీరికి దూర ప్రయాణాలపైన ఆసక్తి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. హానుమాన్ చాలిసా పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి..
ఈరోజు వీరికి పనులలో ఒత్తిడి పెరుగుతుంది. సామాజిక పరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శివాభిషేకం చేసుకోవడం మంచిది.
Kajal Aggarwal: మరోసారి ఆ స్టార్ హీరో సరసన కాజల్.. ‘ఖైదీ’ భార్యగా నటించనున్న అందాల చందమామ..