AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు.. ఇతరుల నుంచి ప్రశంసలు

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు...

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు.. ఇతరుల నుంచి ప్రశంసలు
Subhash Goud
|

Updated on: Mar 10, 2022 | 6:46 AM

Share

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఇక ప్రతి రోజు తమతమ రాశి ఎలా ఉంటుందని తెలుసుకుంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మార్చి 10 (గురువారం)న రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

  1.  మేష రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు.
  2.  వృషభ రాశి: ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం అదుపులో ఉంటుంది.
  3. మిథున రాశి: చేపట్టిన పనులకు ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంది. ధైర్యంతో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు.
  4.  కర్కాటక రాశి: అధికారులతో జాగ్రత్తగా వహించడం మంచిది. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు.
  5. సింహ రాశి: ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అంతా మంచి జరుగుతుంది.
  6.  కన్య రాశి: ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.
  7.  తుల రాశి: కొన్ని విషయాలలో మీరు అనుకున్నదానికన్న ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు.
  8.  వృశ్చిక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.
  9.  ధనుస్సు రాశి: అందరిని కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో అశ్రద్ద వహించరాదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  10.  మకర రాశి: ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు పడటం మంచిది. పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైన ఆందోళనకు గురవుతారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి.
  11.  కుంభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
  12.  మీన రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి దర్శనం మేలు చేస్తుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

ఇవి కూడా చదవండి:

Adi Shankaracharya: అమ్మ ప్రేమ, త్యాగాన్ని తెలియజేస్తూ… మనస్సును కదిలించే ఆదిశంకరాచార్య మాతృ పంచకం

Hindu Tradition: పూర్వం గడపకు పసుపు, కుంకుమతో పూజ చేసి.. రోజులో పనిని మొదలు పెట్టేవారు ఎందుకంటే..

Follow Us
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్