Feng Shui Vastu: ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు.. సంపద మీ వెంటపడుతుంది!

Feng Shui Tips: ఫెంగ్ షుయ్ అనేది చైనాకు చెందిన ప్రాచీన నిర్మాణ, శక్తి సమతుల్యత పద్ధతి. ఫెంగ్ షుయ్ నమ్మకాల ప్రకారం, ఇంట్లో కొన్ని ప్రత్యేక విగ్రహాలను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని చెబుతారు. ముఖ్యంగా కొన్ని విగ్రహాలు సంపదను, అదృష్టాన్ని ఆకర్షించే శక్తి కలిగినవిగా భావిస్తారు.

Feng Shui Vastu: ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు.. సంపద మీ వెంటపడుతుంది!
Feng Shui Tips

Updated on: May 25, 2026 | 6:35 PM

ఫెంగ్ షుయ్ అనేది చైనాకు చెందిన ప్రాచీన నిర్మాణ, శక్తి సమతుల్య శాస్త్రం. ఈ విధానం ప్రకారం, మన ఇంట్లో ఉన్న వస్తువులు సానుకూల లేదా ప్రతికూల శక్తులను ప్రభావితం చేస్తాయి. కొన్ని వస్తువులు ఇంట్లో శుభశక్తిని పెంచి ఆనందం, ఐశ్వర్యం తీసుకువస్తే, మరికొన్ని ప్రతికూలతను పెంచి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి కారణమవుతాయని నమ్మకం. ముఖ్యంగా ఇంట్లో సానుకూల శక్తి పెరిగితే, సంపద నిలకడగా ఉండటంతో పాటు అనవసర ఖర్చులు కూడా తగ్గుతాయని ఫెంగ్ షుయ్ చెబుతుంది. అందుకే కొన్ని ప్రత్యేక విగ్రహాలను ఇంట్లో ఉంచడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇప్పుడు అలాంటి అదృష్టాన్ని ఆకర్షించే విగ్రహాల గురించి తెలుసుకుందాం.

మూడు కాళ్ల కప్ప

ఫెంగ్ షుయ్‌లో మూడు కాళ్ల కప్ప (Money Frog)ను సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ధనం, ఐశ్వర్యం, శ్రేయస్సు ఆకర్షితమవుతాయని నమ్మకం. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, ఆదాయం పెరగడానికి సహాయపడుతుందని చెబుతారు. కొన్నిసార్లు ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయని ఫెంగ్ షుయ్ విశ్వాసం.

నవ్వుతున్న బుద్ధుడు

నవ్వుతున్న బుద్ధుడి విగ్రహం ఆనందం, శాంతి, సంపదలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు కూడా తగ్గుతాయని ఫెంగ్ షుయ్ చెబుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడటానికి ఇది సహాయపడుతుందని నమ్ముతారు.

ఏనుగు విగ్రహం

వాస్తు శాస్త్రంలోనూ, ఫెంగ్ షుయ్‌లోనూ ఏనుగుకు ప్రత్యేక స్థానం ఉంది. ఏనుగు బలం, స్థిరత్వం, శ్రేయస్సుకు ప్రతీకగా భావించబడుతుంది. ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే ఆర్థిక స్థిరత్వం పెరిగి, డబ్బుకు కొరత ఉండదని నమ్మకం. అలాగే కుటుంబానికి రక్షణ, అదృష్టం కూడా కలుగుతాయని చెబుతారు.

పరుగెత్తే గుర్రం విగ్రహం

ఫెంగ్ షుయ్ ప్రకారం, పరుగెత్తే గుర్రం విజయానికి, వేగవంతమైన పురోగతికి సంకేతం. ఈ విగ్రహాన్ని ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచితే ఆర్థిక అడ్డంకులు తొలగి, కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధించవచ్చని విశ్వసిస్తారు. ఇది జీవితంలో కొత్త అవకాశాలను ఆకర్షించే శక్తిగా భావించబడుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us