
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు తిరుగుం డదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.
ఉద్యోగంలో కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉండవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవ కాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇరకాటంలో పడే అవ కాశం ఉంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఆస్తి వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఏ పని తల పెట్టినా తప్పకుండా వ్యయ ప్రయాసలుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యంగా నిరు ద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి తక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్య లున్నప్పటికీ వాటిని త్వరగానే అధిగమిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారు బాగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా సాగుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆదాయంలో కొద్దిపాటి ఒడిదుడుకులుంటాయి. ఖర్చులు తగ్గించి పొదుపు సూత్రాలు పాటించడం మంచిది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయా సలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం పరవా లేదనిపిస్తుంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.
ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరు గుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవ కాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కుటుంబ జీవితం సాను కూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది,
ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపో తుంది. వ్యాపారాలు లాభసాటిగా అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రుల మీద, కుటుంబ సభ్యుల మీద మితిమీరి ఖర్చు చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వాహన ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండడంమంచిది.
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి ఎదుగు తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయ వంతంగా పూర్తవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చవద్దు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి లోటుండదు.
ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలను చేరుకుంటారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, పోలీస్ రంగాలకు చెందినవారికి సమయం అనుకూలంగా ఉంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాల రంగంలోని వారు లాభాల బాట పడతారు. నిరుద్యోగులు తప్పకుండా ఒకటి రెండు ఆశించిన శుభవార్తలను వినే అవకాశం ఉంది.
ఉద్యోగ బాధ్యతల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొన్ని మార్పులు చేపడతారు. నిరు ద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. విదే శీయానానికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. అద నపు ఆదాయానికి లోటుండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకాలేదు.
వృత్తి, ఉద్యోగాలు బాగా సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వాహనాలను నడపడంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఆర్థిక లావా దేవీలు సత్ఫలితాలనిస్తాయి. ప్రస్తుతం ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది.