ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: సెప్టెంబర్ 21, 2026 సోమవారం 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం నుంచి మీనం వరకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, వివాహం, ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి. కొన్ని రాశులకు ఆదాయం, ఉద్యోగ అవకాశాలు, శుభవార్తలు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులు ఖర్చులు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today

Edited By:

Updated on: Sep 21, 2026 | 6:48 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 21, 2026): మేషం రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా, ఆశించిన విధంగా కొనసాగుతాయి. వృషభం రాశివారికి ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో భారీగా లాభాలు గడిస్తారు. మిథునం రాశివారికి ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా, ఆశించిన విధంగా కొనసాగుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు వృద్ధి చెందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కొన్ని శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో భారీగా లాభాలు గడిస్తారు. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆస్తి వివాదం కుటుంబ పెద్దల సహాకారంతో పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకో వాల్సిన అవసరం ఉంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. వృత్తి జీవితంలో కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి సంబంధమైన లాభం పొందుతారు. ధనాదాయానికి లోటుండదు. ఆరోగ్యం అన్నివిధాలా అనుకూ లిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలను సొంతగా నిర్వహించుకోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచన లున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ బాధ్యతలకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. తలపెట్టిన పనులు, కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆస్తికి సంబంధించిన వివాదంలో తండ్రితో కొద్దిగా అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఉద్యోగంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. హోదా పొందే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయ త్నాలు కార్యరూపం దాలుస్తాయి. తలపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్ని విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందు తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యు లతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం, ప్రోత్సాహకాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలను కూడా స్వీకరించడం మంచిది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇష్టమైన బంధువుల్ని అనుకోకుండా కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. బంధుమిత్రుల విషయాల్లో తలదూర్చవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. తల పెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కార్య సిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సొంత ఇల్లు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో శుభవార్త వింటారు. కొందరు ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వాహన సౌకర్యం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

ఉద్యోగంలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగు తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కీలక విషయాల్లో కొందరు బంధుమిత్రులు అండగా నిలబడతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు. సహచరుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఇంటా బయటా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us