
దిన ఫలాలు (అక్టోబర్ 27, 2026): మేష రాశికి చెందిన వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన హోదా లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని లబ్ధి పొందుతారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తల పెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వాహన సౌకర్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన హోదా లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభ కార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంవారికి లాభాల పంట పండుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలుచేసే పనులు చేస్తారు. విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది.
ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెట్టాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదు రవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయా ణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.
ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థి తులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. ఆదాయం పెరిగినప్పటికీ అంతకు మించి ఖర్చు లుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పురోగమిస్తాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగు తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందనలభిస్తుంది.
ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ వృత్తి అయినప్పటికీ, బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్య కలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.
వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక వ్యవహా రాలు నిలకడగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయ త్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.
ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు కానీ, అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతికి దూర మవుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు, వ్యూహాలను మార్చుకుని లబ్ధి పొందుతారు. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. అద నపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. రావలసిన సొమ్ము వసూలవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఇంట్లో అదనపు సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులతో అను కూ లతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అంచనాలకు మించి సంపాది స్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వా నాలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం ఆశాజ నకంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.