
దిన ఫలాలు (అక్టోబర్ 11, 2026): మేష రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. మిథున రాశి వారికి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా పురోగమిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. బంధు మిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల అంచనాలకు మించి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు.
నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబం ధించిన పనులు ఊపందుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. పదోన్నతి లభించే అవకాశం ఉంది. మంచి ఉద్యోగం లోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. వృత్తి జీవితంలో ఆశించిన దానికంటే ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలకు సమ యం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహా రాలు సాఫీగా సాగుతాయి. బంధుమిత్రులకు సహాయపడతారు. ఆరోగ్యం అనుకూలంగాఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు బిజీగా సాగు తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఒక ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తన రంగంలో పురో గతి చెందుతారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి, ఆర్థిక, ఆదాయ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా పురోగమిస్తాయి.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయానికి తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రయ త్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు.
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సకాలంలో లక్ష్యాలు, బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాలు రాబడిపరంగా సజావుగా, సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. సోదరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. దగ్గర బంధువుల రాకపోకలుం టాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ధనపరంగా వాగ్దానాలేవీ చేయవద్దు.
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపో తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరంగా ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు.
ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం అంచనాలకు మించి పురోగతి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలకు అవకాశమిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో అశ్రద్ధ తగదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనాలతో వ్యవ హరించడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లబిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యం వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి తప్పకపోవచ్చు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. గృహ ప్రయ త్నాలు చేపడతారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
Also Read: వారఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి విషయాల్లో శుభవార్తలు..