
దిన ఫలాలు (నవంబర్ 4, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో వేగం, ఉత్సాహం పెరుగుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయం ఆశించిన స్థాయిలో బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో వేగం, ఉత్సాహం పెరుగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రావ లసిన సొమ్ము చేతికి అందుతుంది. మీ వల్ల కొందరు బంధుమిత్రులు బాగా లబ్ధి పొందుతారు.
వృత్తి, ఉద్యోగాల్లో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా పురోగమిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొత్త లక్ష్యాల్ని చేపట్టాల్సి వస్తుంది. వ్యాపా రాల్లో నష్టాలు బాగా తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పెండింగ్ పనులు, వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. ఇతరుల బరువు బాధ్యతలను మీరు నిర్వర్తించడం వల్ల బాగా నష్టపోతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగు చూస్తాయి. అధికారుల నుంచి గుర్తింపు లభి స్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంటుంది. అనుకోని వ్యయ ప్రయా సలు తప్పకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు సంతృప్తికరంగా పరిష్కారమవుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. మిత్రులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పనుల్ని పూర్తి చేయడంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. అనవసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది.
వృత్తి, వ్యాపారాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్త వుతాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో కొందరికి సహాయం చేయడం జరుగు తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. ఇష్టమైనవారిని కలుసుకుంటారు.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. అవసరానికి సరిపడ డబ్బు అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధించే అవ కాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. బంధుమిత్రుల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. కెరీర్ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందు తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. జీవిత భాగస్వా మితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక శుభ కార్యంలో దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్య సిద్ధి ఉంటుంది. సోదర వర్గంతో ఆస్తిపాస్తుల వివాదాలు, విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
రోజంతా సంతృప్తికరంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అన వసర ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహాలు పెరుగుతాయి. బరువు బాధ్యతలు కొద్దిగా పెరిగే అవకాశముంది. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమ స్యలకు పరిష్కారం దొరుకుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. కొంత ఆలస్యంగానైనా ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన కబుర్లు వింటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.