
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
లాభ స్థానంలో బుధ, రాహువుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈ రాశిలో శుక్ర, రవుల యుతి వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విలాసాల్లో మునిగి తేలుతారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
లాభ స్థానంలో శని, కుజ, రవి గ్రహాల సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపో వచ్చు. తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం ఉంటాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ధన స్థానంలో గురు సంచారంవల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రాశినాథుడైన బుధుడు రాహువుతో కలిసి భాగ్య స్థానంలో ఉండడం ఈ రాశివారికి తప్ప కుండా అదృష్టం కలిగిస్తుంది. ఆలోచనలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలివితేటలకు, ప్రతిభకు, శ్రమకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. షేర్లు బాగా లాభిస్తాయి. లాభ స్థానంలో శుక్రుడి వల్ల ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
దశమ స్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో రవి, కుజ, శనుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పదోన్నతి సూచనలున్నాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. శరీరానికి విశ్రాంతి అవసరమనిపిస్తుంది. రవి, శుక్రుల అనుకూల సంచా రం వల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండడం, మధ్య మధ్య అదనపు బాధ్యతలు మీద పడడం వంటివి జరుగుతాయి. ప్రతి పనీ ఆలస్యం అవుతుం టుంది. లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారమై, వారితో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా చికాకులుంటాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సప్తమంలో శనీశ్వరుడి వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సంపాదన పెరుగుతుంది. గౌరవ మర్యాదలు ఏర్పడ తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆలోచనలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రు, రోగ, రుణ బాధలు తగ్గుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశికి సప్తమంలో సంచరిస్తున్న రాశ్యధిపతి శుక్రుడు, భాగ్య స్థానంలో ఉన్న గురువు వల్ల ఏ ప్రయత్నం అయినా కలిసి వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు వెంటనే సమసిపోతాయి. ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత తప్పకుండా ఉంటాయి. సాధారణంగా సుఖ సంతోషాలకు లోటుం డదు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతికి అవకాశం ఉంది. పంచమలో ఉన్న బుధ, రాహువుల వల్ల పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రాశినాథుడైన కుజుడు పంచమ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల తప్పకుండా కార్యసిద్ధి, వ్యవహార జయం, ఆదాయ వృద్ధికి అవకాశం ఉంటుంది. దశమంలో కేతువు వల్ల వృత్తి, ఉద్యో గాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన వ్యవహారాలన్నీ సఫలం అవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కొద్దిగా డబ్బు నష్టం, వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. చతుర్థ స్థానంలో ఉన్న రాహు, బుధుల వల్ల తోబుట్టువులతో ఆస్తి సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయ స్థానంలో బుధ, రాహువులున్నందువల్ల జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదు. సప్తమ గురువు వల్ల శుభ వార్తలు వింటారు. పంచమ స్థానంలో రవి, శుక్రుల వల్ల ఆదాయ వృద్ధితో పాటు, కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని పెళ్లి సంబంధం కుదురు తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ రాశిలో సంచరిస్తున్న రవి, శుక్రుల వల్ల ధనాదాయం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక వ్యవ హారాలు విజయవంతం అవుతాయి. అష్టమ శని వల్ల పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. ధన స్థానంలో ఉన్న కుజ, బుధుల వల్ల బంధుమిత్రుల నుంచి ఇబ్బందులుంటాయి. దశమంలో ఉన్న గురు రాహువుల వల్ల సహోద్యోగులతో సమస్యలుం టాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
పంచమ స్థానంలో ఉన్న గురువు, తృతీయంలో ఉన్న శుక్రుడి వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పెరుగుదల ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఏలిన్నాటి శని వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్న రాహు, బుధుల వల్ల పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టుకోవడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకో వడం జరుగుతుంది. వృథా వ్యయం, అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ధన స్థానంలో ఉన్న శుక్రుడి కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. తప్పకుండా ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. సొంత రాశిలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. వ్యయ స్థానంలో ఉన్న బుధ, రాహువుల వల్ల అనవసర ఖర్చులుంటాయి. వైద్య ఖర్చులకు కూడా అవకాశం ఉంది. కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. ఇంటా బయటా పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.