Horoscope Today (March 14, 2023): ఆ రాశుల వారికి అనుకూలంగా ప్రేమ వ్యవహారాలు.. 12 రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?

| Edited By: Shaik Madar Saheb

Mar 14, 2023 | 2:30 AM

Daily Horoscope Today: 12 రాశుల వారికి మంగళవారం (మార్చి 14) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (March 14, 2023): ఆ రాశుల వారికి అనుకూలంగా ప్రేమ వ్యవహారాలు.. 12 రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today (March 14, 2023)
Image Credit source: TV9 Telugu
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. సునాయాసంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇవి కూడా చదవండి

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొందరు బంధువులకు సలహాలు ఇచ్చి సహకరిస్తారు.  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ  వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొండి బాకి ఒకటి వసూల్ అవుతుంది. ఆర్థిక అవసరాలు తీరుతాయి. పొదుపు పాటిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. బంధువు లలో ఒకరు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనుకోకుండా చిన్నపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆహార విషయాల్లో జాగ్రత్త ఉండటం మంచిది. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. సహచరుల నుంచి అండదండలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. వాగ్దానాలు చేయడం, హామీ ఇవ్వడం ప్రస్తుతానికి మంచిది కాదు.  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

మనసులోని ముఖ్యమైన కోరిక ఒకటి నెరవేరుతుంది. ఉద్యోగంలో లక్ష్యాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులు లేనిపోని మాటలతో ఇబ్బంది పెడతారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు గడిస్తారు. ఐటీ వారికి చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఐటీ రంగం వారు పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో పెద్దల నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం
చేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొంచెం కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడటం మంచిది కాదు. స్నేహితులు ముఖం చాటేస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం
లభిస్తుంది. ఆదాయపరంగా నిలకడగానే ఉంటుంది. విలాసాల మీద ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అవసరాలు తీరుతాయి. ఉద్యోగం పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి
వ్యాపారాల్లో కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి సమస్యలు తలెత్తుతాయి. శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళతాయి.

కుంభం (దనిషత 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగానే సాగిపోతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు చాలావరకు పరవాలేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముందుకు వెళతారు. ఇతరులకు సహాయం చేస్తారు.
పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..