జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా ఉంది?

Horoscope Today (July 23, 2026): గురువారం నాటి రాశిఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆదాయ వృద్ధి, వ్యక్తిగత సమస్యల పరిష్కారం వంటి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారు కీలక నిర్ణయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఎలాంటి ఫలితాలను ఇవ్వనుందో తెలుసుకోండి.

జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా ఉంది?
Horoscope Today 23 July 2026

Edited By:

Updated on: Jul 23, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూలై 23, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో వృషభ రాశి వారి మాట చెల్లుబాటు అవుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తుంది. సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో మీ సరికొత్త నిర్ణయాలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఒకటి రెండు ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం అభిస్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటుండకపోవచ్చు. రాజకీయ ప్రముఖులతో పరి చయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల్లో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవు తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పని ఒత్తిడి, విమర్శలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కొన్ని అనుకోని ఖర్చులు మీద పడే అవ కాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. నిరుద్యోగులకు తప్పకుండా కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అన్నివిధాలా అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కోరుకున్న ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు, ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలువింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదా యకంగా సాగిపోతాయి. ఒక్క క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్ప డుతుంది. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

‍రోజంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశిం చిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు కాలం కలిసివస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, లభిస్తాయి లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెడతారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణ యాలతో ముందుకు వెడతారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగి, ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయ త్నాలు కూడా సానుకూలపడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరు గుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

Also Read: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..

Follow Us