
వృషభం: ఈ రాశికి పంచమ స్థానాధిపతి బుధుడితో తృతీయ స్థానాధిపతి చంద్రుడి పరివర్తన వల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం: చతుర్ధాధిపతి బుధుడికి, ధనాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు ఆస్తి వివాదాల్లో శుభవార్తలు వింటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. రావాల్సిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది.

కర్కాటకం: ఈ రాశ్యధిపతి చంద్రుడితో తృతీయ స్థానాధిపతి బుధుడికి పరివర్తన జరగడం వల్ల అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కార మవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. తల్లి వైపు నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది.

కన్య: రాశ్యధిపతి బుదుడితో లాభాధిపతి చంద్రుడికి పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అన్ని రంగాల్లోనూ అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్ల వ్యాపారం బాగా లాభిస్తుంది.

మకరం: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల అనేక విధాలుగా అదృ ష్టాలు కలుగుతాయి. తప్పకుండా మహా భాగ్య యోగం పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందు తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.

మీనం: ఈ రాశికి పంచమ, సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.