Budh Gochar 2024: మేషరాశిలో బుధుడు సంచారం.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

|

May 10, 2024 | 1:05 PM

నవ గ్రహాల్లో బుధుడు చాలా ముఖ్యమైన తెలివైన గ్రహంగా పరిగణించబడుతుంది. తెలివితేటలు, గణితం, తెలివి, తర్కం, స్నేహం, కమ్యూనికేషన్ కారకం గ్రహంగా బుధుడు పరిగణింపబడుతున్నాడు. మేష రాశిలో బుధుడు ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలగానున్నాయి. ఈ రోజు బుధగ్రహ ప్రవేశంతో ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ రాశులకు చెందిన వారి అదృష్టం మారిపోతుంది

Budh Gochar 2024: మేషరాశిలో బుధుడు సంచారం.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Budh Gochar 2024
Follow us on

మేషరాశిలో బుధుడు ప్రవేశంతో కొన్ని రాశులకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 06:42 గంటలకు బుధుడు మీనరాశి నుంచి బయటకు వచ్చి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు మేషరాశిలో మే 31 మధ్యాహ్నం 12:20 గంటలకు ఉండనున్నాడు. అనంతరం బుధుడు తన రాశిని మార్చుకుంటాడు.. అంటే బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించానున్నాడు. అయితే మేష రాశిలోకి బుధుడు ప్రవేశంతో కొన్ని రాశులకు శుభాఫలితాలు ఉంటాయి. నవ గ్రహాల్లో బుధుడు చాలా ముఖ్యమైన తెలివైన గ్రహంగా పరిగణించబడుతుంది. తెలివితేటలు, గణితం, తెలివి, తర్కం, స్నేహం, కమ్యూనికేషన్ కారకం గ్రహంగా బుధుడు పరిగణింపబడుతున్నాడు. మేష రాశిలో బుధుడు ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలగానున్నాయి. ఈ రోజు బుధగ్రహ ప్రవేశంతో ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ రాశులకు చెందిన వారి అదృష్టం మారిపోతుంది

మిధునరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టం సొంతం అవుతుంది. తక్కువ శ్రమతో గొప్ప విజయాన్ని పొందుతారు. కెరీర్‌లో శుభఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారంలో లాభాలను కూడా పొందవచ్చు. దీంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. ప్రేమ విషయంలో ఓపిక పట్టండి. కెరీర్‌లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రభావం పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభించవచ్చు. బుధ సంచారంతో స్థానం, ప్రతిష్ట పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు మేషరాశిలో బుధుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు పెద్ద పదవిని పొందవచ్చు. శత్రువును జయిస్తారు. మీరు అనుకున్న పనిలో విజయం సాదించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది.

తులా రాశి: తుల రాశి వారు తమ కెరీర్‌లో గొప్ప స్టేజ్ కు చేరుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు, కొత్త కొలువుని కూడా పొందవచ్చు. ఈ సమయంలో ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. బుధ సంచారంతో ఆరోగ్య పరంగా సింహ రాశికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ధనుస్సు రాశి: మేషరాశిలోకి బుధుడు ప్రవేశించడం ధనుస్సు రాశికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కొత్తగా పెళ్లైన జంటలకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ సంబంధమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగం కోసం అన్వేషణ ఫలించి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కుంభ రాశి: కుంభ రాశి వారికి బుధ సంచారము వలన కూడా శుభ ఫలితాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు. అయితే కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మే 10 నుండి మే 31 వరకు శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు