మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు, ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. బంధువుల విషయంలో ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. దీర్ఘకాలిక రోగులకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. భరణి నక్షత్రం వారికి స్నేహితుల వల్ల కలిసి వస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. అధికారులకు మీ సూచనలు, సలహాలు ఆచరణ యోగ్యంగా కనిపిస్తాయి. ఆదాయం లేదా సంపాదన పెరిగే సూచనలు ఉన్నాయి. అవసరాలకు తగ్గ డబ్బు అందుతుంది. బంధుమిత్రులకు ఉదారంగా సహాయం చేస్తారు. పిల్లలకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రోహిణి నక్షత్రం వారికి ధన లాభం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం సానుకూలంగా మార్పు చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఐటీ రంగం వారు ముందుకు దూసుకు పోతారు. ఆదాయపరంగా, లాభాలపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. పునర్వసు వారు శుభవార్త వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అధికారుల నుంచి ఒత్తిడి, సహచరుల నుంచి కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. వ్యవహార శైలిని కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యసనాల జోలికి పోవద్దు. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. రోహిణి వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పక పోవచ్చు. భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రస్తుతానికి మౌనం వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి యధాతధంగా ఉంటుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. చదువుల్లో పిల్లలు చక్కని విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. పుబ్బ నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులకు మీ సలహాల మీద గురి కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు వికటించే ప్రమాదం ఉంది. బంధువుల సహాయంతో పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి ఉద్యోగం లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాట తొందర పనికిరాదు. ఆర్థికపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆహార విహారాల్లో నియమాలు పాటించడం అవసరం. స్వాతి, విశాఖ వారికి ఇష్టపడిన వారితో పెళ్లి కుదురుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
కొన్ని ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు కొంతమేరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో సహచరులు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఆశాజనకంగానే ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువై ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అదృష్ట యోగం పట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగ పరంగా మంచి ఇంక్రిమెంట్ పొందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. రుణ సమస్య తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించడం జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. పూర్వాషాడ నక్షత్రం వారు శుభవార్త వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయడం మంచిది. ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఐ టి వారు శక్తికి మించి శ్రమ పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలపడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. ఉత్తరాషాడ వారికి సమయం అనుకూలంగా ఉంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆరోగ్యంలో తేడా వస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలతో అవస్థలు పడతారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. శతభిషం వారి మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చు కుంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు సజావుగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆరోగ్యం పైన ఓ కన్ను వేసి ఉంచాలి. రోడ్డు ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభాద్ర వారికి కలిసి వస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..