‘చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?’, ‘నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా’ : విజయసాయిరెడ్డి

Vijayasai Reddy slams nara lokesh again : టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ..

చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?, నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా : విజయసాయిరెడ్డి

Updated on: Apr 08, 2021 | 3:51 PM

Vijayasai Reddy slams nara lokesh again : టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర స్థాయిలో ట్విట్టర్‌ వేదికగా వరుస సెటైర్లు గుప్పించారు. వైసీపీ ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “జగన్ గారు ఎన్ని ఉద్యోగాలిచ్చారో మీ బాబును, కుల మీడియాను అడుగు మాలోకం. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా. చిన్న మెదడు డ్యామేజి అయినోడివి ఏదైనా అంటావు. ఖర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టికి నువ్వో ‘పేద్ద’ నాయకుడివి. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే.”

“TRSలో తెలంగాణ TDP విలీనమైంది, TDLPని మూసేశారు. AP టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాలసిందే. లేకపోతే కృష్ణార్పణమో, గోదావరిలో నిమజ్జనం చేస్తారా? పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రంకు ఇక నిరాశా, నిస్పృహే. చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?” అంటూ నారాలోకేష్ పై విజయసాయిరెడ్డి హాట్ హాట్ కామెంట్లు చేశారు. కాగా, నారా లోకేష్ ఏపీలో విస్తృతంగా పర్యటిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విజయసాయి ఇలా రెచ్చిపోయారు.

Read also : ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు