‘చంద్రబాబుకి మళ్లీ సీబీఐ మీద నమ్మకమెప్పుడు వచ్చింది?’

|

Sep 10, 2020 | 7:21 PM

ఆంధ్రప్రదేశ్ లో భక్తుల ముసుగులో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని..

చంద్రబాబుకి మళ్లీ సీబీఐ మీద నమ్మకమెప్పుడు వచ్చింది?
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో భక్తుల ముసుగులో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
ప్రభుత్వం మీద ఎందుకు నిరసన చేయాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. దైవభక్తి లేని వ్యక్తి చంద్రబాబేనన్న అంబటి.. గతంలో సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదన్న బాబుకు సీబీఐ మీద ఇప్పుడు నమ్మకం ఎలా కలిగిందో చెప్పాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని.. సీబీఐ విచారణ చేయడానికి తమకెలాంటి అభ్యతరం లేదని తెలిపారు. అంతర్వేది ఘటనపై ఎలాంటి విచారణ జరిపేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, మానవ రూపంలో ఉన్న దెయ్యం చంద్రబాబు అని ఆయన విమర్శలు గుప్పించారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడం దురదృష్టకరమని.. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఈవోను వెంటనే తొలగించిందని పేర్కొన్నారు. కొత్త రథాన్ని తయారు చేయడం కోసం ప్రభుత్వం 95 లక్షల రూపాయిలు కేటాయించిందని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అంబటి వెల్లడించారు.