YS Jagan: మేమంతా సిద్ధం.. 4 పాయింట్ల ఫార్ములాతో సీఎం జగన్‌ దూకుడు.. నేడు బస్సు యాత్రకు బ్రేక్..

2019లో ఏంచేస్తామో చెప్పి ఓట్లడిగాం.. ఇప్పుడు చేసింది చెప్పి ఓట్లడుగుతాం. సింపుల్‌ కాన్సెప్ట్‌, సింగిల్ అజెండా. సామాజిక న్యాయం చేస్తామన్నాం, చేసి చూపించాం. రైతును రాజును చేస్తామన్నాం.. ఆ స్థాయిలో నిలబెట్టాం. ఇలా సాగుతోంది జగన్‌ ప్రచారం. ఫోర్‌ పాయింట్‌ ఫార్ములాలో.. సామాజికన్యాయం, రైతు సంక్షేమంపై జగన్‌ చెబుతున్న పిన్‌పాయింట్‌ అంశాలేంటి?

YS Jagan: మేమంతా సిద్ధం.. 4 పాయింట్ల ఫార్ములాతో సీఎం జగన్‌ దూకుడు.. నేడు బస్సు యాత్రకు బ్రేక్..
Ys Jagan
Follow us

|

Updated on: Mar 31, 2024 | 8:18 AM

సూటిగా.. సుత్తిలేకుండా..! నాలుగే నాలుగు మాటలు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో జరిగిందేంటి, ఈ 58 నెలల్లో తాను చేసిందేంటి. జస్ట్.. ఫోర్ పాయింట్ ఫార్ములా. ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ నింపాలనుకోవడం లేదు సీఎం జగన్. బ్యాంక్‌కు వెళ్లండి.. అకౌంట్లలో పడిన డబ్బులు చూడండి. ఐదేళ్లకు ముందు ఇలా డబ్బులు పడ్డాయో లేదో కంపేర్ చేసుకోండి.. అంటూ చంద్రబాబు పాలనపైనా, తన పనితనంపైనా క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు. విద్య, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సామాజికన్యాయం. ఈ నాలుగు అంశాలపై మాట్లాడుతున్న మాటలు జనంలోకి సూటిగా వెళ్తున్నాయి, ప్రతిపక్షాలకూ సూటిగా తగులుతున్నాయి. తాను ఎంపిక చేసిన అభ్యర్ధులందరూ పేదవాళ్లేనంటూ ఒక్కొక్కరిని జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఎన్నికలను పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు సీఎం జగన్. దానికి తగ్గట్టుగానే.. ఈసారి ఎలాంటి అభ్యర్ధులను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారో వివరించారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం బాగుంటుంది. రైతులకు మేలు జరిగే పథకాలు అందించడంలో వైఎస్ వారసత్వాన్ని అనుసరిస్తున్న సీఎం జగన్.. ఈ 58 నెలల్లో రైతులకు చేసిందేంటో వివరించారు. పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ఏటా 13వేల 500, విపత్తులతో నష్టపోయిన రైతుల ఖాతాలకు 1294 కోట్లు, ఇన్సూరెన్స్ సొమ్ము కింద రైతులకు 7802 కోట్లు, 10వేల 778 రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కింద 33వేల 300 కోట్లు.. ఇలా 58 నెలల్లో చేసింది చెప్పారు.

అదే సమయంలో.. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి, చేయకుండా దాటవేసినవి ఏంటో కూడా సవివరంగా ప్రజల ముందుంచారు. ఆనాటి మేనిఫెస్టో చూపిస్తూ.. చంద్రబాబు పాలనపై పంచ్‌లు వేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఆడపిల్ల పుడితే 25వేలు, నిరుద్యోభృతి, మూడు సెంట్ల భూమి.. ఇలా 650 హామీలు ఇచ్చారంటూ మరోసారి గుర్తుచేశారు.

మేనిఫెస్టోను 98 శాతం పూర్తి చేసిన ప్రభుత్వానికి రాఖీ కడతారా.. మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన ప్రతిపక్షాలకు ఓటు వేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు సీఎం జగన్.

సీఎం జగన్‌ బస్సు యాత్రకు ఈరోజు విరామం..

బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన సీఎం జగన్‌… అనంతపురం జిల్లాలోనే ఈస్టర్‌ను జరుపుకోనున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు జగన్‌. అలాగే, ఇవాళ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీలు కొనసాగనున్నాయ్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..