Megastar Chiranjeevi: స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్.. ఎందుకంటే..

తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు చిరు. ఈరోజు ఫ్యామిలీతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. చిరుతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇలా ఉన్నట్లుండి చిరంజీవి కుటుంబంతో కలిసి దేశ రాజధాని వెళ్లడానికి కారణం కూడా ఉంది. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi: స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్.. ఎందుకంటే..
Chiranjeevi, Ram Charan
Follow us

|

Updated on: May 08, 2024 | 6:18 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు చిరు. ఈరోజు ఫ్యామిలీతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. చిరుతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇలా ఉన్నట్లుండి చిరంజీవి కుటుంబంతో కలిసి దేశ రాజధాని వెళ్లడానికి కారణం కూడా ఉంది. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డ్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. ఇప్పటికే రాష్ట్రపతి దౌపది ముర్పు చేతుల మీదుగా ఈ పద్మ అవార్డులను ఎంపికైన వారికి అందించారు. ఇక రేపు (మే 9)న మిగిలిన వారికి ఈ పురస్కారాలను అందించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడానికి ఈరోజు సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరారు. చిరంజీవితోపాటు.. ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.

రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు చిరు. ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. చిరు నటిస్తున్న విశ్వంభర సినిమా త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..