Seema Politics: సీమ టీడీపీ నేతల సదస్సుకు వైసీపీ కౌంటర్.. కమ్మభవన్‌లో నిర్వహించడం పై మీ ఆంతర్యం ఏంటని ప్రశ్న

|

Sep 11, 2021 | 9:13 PM

కృష్ణా జలాలపై పోరుకు రాయలసీమ టీడీపీ నేతలు ఇవాళ అనంతపురంలో నిర్వహించిన సదస్సుకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

Seema Politics: సీమ టీడీపీ నేతల సదస్సుకు వైసీపీ కౌంటర్..  కమ్మభవన్‌లో నిర్వహించడం పై మీ ఆంతర్యం ఏంటని ప్రశ్న
Gorantla Madhav
Follow us on

Krishna Waters: కృష్ణా జలాలపై పోరుకు రాయలసీమ టీడీపీ నేతలు ఇవాళ అనంతపురంలో నిర్వహించిన సదస్సుకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అసలు సభ కమ్మభవన్‌లో నిర్వహించడం పై మీ ఆంతర్యం ఏంటని ప్రశ్నించిన వైసీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ దద్దమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం అంటూ మంత్రి శంకరనారాయణ ఫైరయ్యారు. 15 సంవత్సరాల అధికారంలో చేయలేకపోయిన చంద్రబాబుని ఎందుకు నిలదీయలేకపోయారని మండిపడ్డారు.

మహానేత వైఎస్ దయతోనే హంద్రీనీవా ద్వారా కుప్పంకి కూడా నీళ్లు వెళ్లాయి.. సీఎం జగన్ ని విమర్శించేందుకు టీడీపీ నేతలు సమావేశం పెట్టుకున్నారు అంటూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఎందుకు సమావేశం పెట్టారో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పారని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాజకీయ నిరుద్యోగంతో తమ అస్తిత్వం కోసం సమావేశాలు నిర్వహించారు.. అది కూడా కమ్మభవన్ లో నిర్వహించడం పై మీ ఆంతర్యం ఏంటి అని మాధవ్ అడిగారు.

దేశంలోనే అత్యల్పంగా వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా పథకానికి రాయలసీమకు చెందిన చంద్రబాబే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి హంద్రీ-నీవా కోసం కేవలం రూ. 9 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. అదికూడా సాగు నీటి పథకంగా ఉన్న హంద్రీ-నీవాను తాగునీటికే పరిమితం చేసిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అనంతపురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విమర్శలు గుప్పించారు.

Read also: Mini Banks: ఏపీలో మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు.. రూ.20 వేల వరకు నగదు విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌ ఫ్రీ..