YS sharmila: పార్టీ విలీనంపై షర్మిల కీలక నిర్ణయం.. నేతలకు స్పష్టం

|

Jan 02, 2024 | 1:29 PM

జనవరి 4వ తేదీన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఆమె నేతలకు తెలిపారు. ఇందులో భాగంగానే ఆమె బుధవారం (రేపు) సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత షర్మిల పార్టీ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించి గత రెండు రోజులుగా పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే...

YS sharmila: పార్టీ విలీనంపై షర్మిల కీలక నిర్ణయం.. నేతలకు స్పష్టం
YS Sharmila
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వైఎస్‌ షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి వస్తున్న వార్తలపై మంగళవారం ఒక స్పష్టత వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌టీపీ భేటీలో వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు. YSRTPని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తున్న షర్మిల పార్టీ నేతలకు స్పష్టం చేశారు. లోటస్ పాండ్ లో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఒకటి రెండు రోజుల్లో అన్ని విషయాలు చెబుతానన్నారు. ఇక ఏపి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని అడిగారని దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ పదవి హామీ ఇచ్చారన్నారు.

జనవరి 4వ తేదీన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఆమె నేతలకు తెలిపారు. ఇందులో భాగంగానే ఆమె బుధవారం (రేపు) సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత షర్మిల పార్టీ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించి గత రెండు రోజులుగా పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఏపీలో మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అందులో భాగంగానే షర్మిలను పార్టీలోకి ఆహ్వానించింది. ఇక షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పిగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గుచూపుతోందని సమాచారం. ఈ మేరకే ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్‌తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి డీకే సన్నిహితుడుకావడంతోనే కాంగ్రెస్‌ పెద్దలను ఒప్పించి, ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఆయన రంగం సిద్ధం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరి షర్మిల తిరిగి కాంగ్రెస్‌లోకి చేరడం ఆ పార్టీకి ఏమేర ఉపయోగపడుతుంది.? ఇది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..