Andhra Pradesh: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ప్రాంక్ వీడియో చేయాలనుకున్నాడు.. సీన్ కట్ చేస్తే.!

|

Jul 08, 2022 | 7:31 PM

ప్రాంక్ వీడియోస్.. ఈ మధ్యకాలంలో కొంతమంది యువకులు తమలోని టాలెంట్ చూపిస్తూ.. వీటి ద్వారా ఓవర్ నైట్ స్టార్స్...

Andhra Pradesh: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ప్రాంక్ వీడియో చేయాలనుకున్నాడు.. సీన్ కట్ చేస్తే.!
Prank Videos
Follow us on

ప్రాంక్ వీడియోస్.. ఈ మధ్యకాలంలో కొంతమంది యువకులు తమలోని టాలెంట్ చూపిస్తూ.. వీటి ద్వారా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతామని కలలు కంటున్నారు. ప్రాంక్ వీడియోలు శృతిమించకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఒకవేళ హద్దు దాటితే మాత్రమే కథ అడ్డం తిరుగుద్ది. అయితే సిటీల్లో ప్రస్తుతం బోల్డ్ ప్రాంక్స్ తంతు ఎక్కువైపోయింది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని ప్రాంక్ వీడియోలతో రచ్చలేపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు చేసిన ప్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గుడియాత్తం కాలేజీ రోడ్డులో మిక్కీ మౌస్, టెడ్డీ బేర్ వేషధారణలో సయ్యద్ కరీముల్లా(21) అనే యువకుడు ప్రాంక్ వీడియో చేయాలనుకున్నాడు. అటుగా వెళ్తున్న మహిళలు, విద్యార్థినులతో ప్రాంక్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మాయిల చెయ్యి పట్టుకుని లాగడం, చిన్న పిల్లలను భయపెట్టడం.. వారి వెంటపడటం.. వింత వింత సైగలు చేయడం లాంటివి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనితో వారి ప్రవర్తనకు విసిగిపోయిన కొందరు మహిళలు.. పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వారు.. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కరీముల్లాను అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..