Women’s Day: పోస్ట్ మాన్‌ను చూశారు.. కానీ పోస్ట్ ఉమెన్‌ను చూశారా..?

|

Mar 08, 2022 | 6:23 PM

మీరు పోస్ట్ మాన్ .. అన్న పాట విన్నారు కదా.. కానీ ఇక్కడ మాత్రం పోస్ట్ ఉమెన్‌ మాట వినాలి.  ఎందుకంటే జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్‌మాన్‌ అని నమ్మిన వాళ్లలో ఆమె ఒకరు...

Womens Day: పోస్ట్ మాన్‌ను చూశారు.. కానీ పోస్ట్ ఉమెన్‌ను చూశారా..?
Post Women
Follow us on

మీరు పోస్ట్ మాన్ .. అన్న పాట విన్నారు కదా.. కానీ ఇక్కడ మాత్రం పోస్ట్ ఉమెన్‌ మాట వినాలి.  ఎందుకంటే జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్‌మాన్‌ అని నమ్మిన వాళ్లలో ఆమె ఒకరు. ఎందుకంటే పోస్టుమాన్‌ లేని ఊరు ఉండదు.. సెల్‌ఫోన్లు లేని రోజుల్లో పోస్టుల ద్వారానే కదా అందరికీ సమాచారం చేరేది. ఏ వార్త అయినా తెలిసేది. అందుకే ఈ కాలం యువత అంతా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, ఎంబీబీఎస్ వంటి ఉపాధిరంగం వైపు చూస్తున్నా.. ఆమె మాత్రం దీనివైపే మొగ్గుచూపింది. పోస్ట్‌ఉమెన్‌ పోస్టునే ఎంచుకుంది.

గుంటూరుకు చెందిన వారధి.. పోస్టు ఉమెన్‌గా విధులు నిర్వహించడానికి స్ఫూర్తి ఆమె తల్లే. వారధి తల్లికి చదువు రాకపోయినా తన బిడ్డలనైనా ప్రయోజకురాలిని చేయాలనుకుంది. కష్టపడి చదివించింది. తల్లి ఆశయానికి అనుగుణంగానే ముగ్గురు బిడ్డలు బాగానే చదువుకున్నారు. వారధి కూడా.. ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది. కొద్దిరోజులు ప్రైవేట్‌ జాబ్‌ చేసినప్పటికీ.. సాటిస్ఫై కాలేదు. ప్రభుత్వ రంగంలోనే పనిచేయాలని నిర్ణయించుకుని ఢాక్‌ సేవక్‌గా మొదట అమరావతి మండలంలోని ఉంగుటూరులో విధులు నిర్వహించింది.

తర్వాత శాఖపరమైన ఎగ్జామ్‌ రాసి పదోన్నతి పొందిన వారధి.. అందులో టాపర్‌గా నిలిచింది. పెళ్లైన అమ్మాయివి.. ఎందుకీ పరీక్షలు.. ఎందుకీ గోల అని చాలా మంది వారధిని.. నిరుత్సాహపరిచినా ఆమె వెనకడుగు వేయలేదు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకే మొగ్గుచూపింది. ప్రస్తుతం కొరికిపాడులో పోస్టు ఉమెన్‌గా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తోంది. ఉద్యోగం ఒక్కటే కాదు.. తనకు తోచిన విధంగా ఎదుటివారికి సహాయ పడుతోంది. చదువు రాని వారికి కావాల్సిన రైటింగ్ సహాయం.. మరికొందరికి మాట సహాయం చేస్తూ ఆసరాగా నిలుస్తోంది. తమపరిధిలో 12 మంది ఉంటే ఇద్దరమే ఫిమేల్‌ ఎంప్లాయిస్‌ అని చెబుతోంది. మొదట్లో ఇబ్బంది పడ్డా.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటోంది. భర్త ప్రోత్సాహంకు తోడు.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనడానికి తానే నిదర్శనమని నిరూపించుకుంటోంది వారధి.

Read Also.. CM KCR: వ‌చ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియం.. కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్..