Gas Leak: అనకాపల్లి జిల్లా క్వాంటమ్‌ కంపెనీలో అమ్మోనియా లీక్‌.. నలుగురు మహిళా కార్మికులకు అస్వస్థత

|

Jun 03, 2022 | 4:58 PM

బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో అమ్మోనియా లీకైంది. ఇందులో క్వాంటమ్‌ కంపెనీలోని మహిళా కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు మహిళలకు ఎస్‌ఈజెడ్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు.

Gas Leak: అనకాపల్లి జిల్లా క్వాంటమ్‌ కంపెనీలో అమ్మోనియా లీక్‌.. నలుగురు మహిళా కార్మికులకు అస్వస్థత
Gas Leak
Follow us on

అనకాపల్లి జిల్లాలో మరో దారుణం జరిగింది. అచ్యుతాపురంలో అమ్మోనియా లీక్‌ అయ్యింది. సీడ్స్ యూనిట్‌లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీకైంది. దీంతో వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. వెంటనే బాధితులను యాజమాన్యం హుటాహుటిన సెజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఎస్ఈజేడ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేస్తున్నారు. బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో అమ్మోనియా లీకైంది. ఇందులో క్వాంటమ్‌ కంపెనీలోని మహిళా కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు మహిళలకు ఎస్‌ఈజెడ్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. పోరస్‌ కంపెనీ నుంచి అమ్మోనియా లీకైందని అధికారులు నిర్ధారణ చేశారు.

అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో 150 మందికి చికిత్స అందిస్తున్నారు. బెడ్స్‌ సరిపోకపోవడంతో ఒక్కో దానిపై ఇద్దరు, ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ సునీల్‌ ఆస్పత్రిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు కలెక్టర్‌ రవి సుభాష్‌, ఎస్పీ గౌతమీ శాలి బ్రాండిక్స్‌లో ఘటనపై విచారణ జరిపారు. ఎంపీ సత్యవతి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆస్పత్రికి వచ్చి పరిస్థితి తెలుసుకున్నారు.

ఏపీ వార్తల కోసం..