Tirumala: పండగ వేళ తిరుమలలో విషాద ఘటన.. సర్వదర్శనం క్యూలైన్ లో గుండెపోటుతో మహిళ మృతి

|

Sep 07, 2024 | 2:52 PM

స్వామి వారి దర్శనానికి వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లి ఝాన్సీని చూస్తూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో సకాలంలో వైద్యం అందలేదని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఝాన్సీకి కవల పిల్లలు ఉన్నారని ఇప్పుడు వారి పరిస్థితి ఏమి అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తునారు.

Tirumala: పండగ వేళ తిరుమలలో విషాద ఘటన.. సర్వదర్శనం క్యూలైన్ లో గుండెపోటుతో మహిళ మృతి
Woman Dead In Tirumala
Follow us on

తిరుమల తిరుపతి క్షేత్రంలో వినాయక చవితి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం కోసం వెళ్తూ ఓ మహిళా భక్తులురాలు గుండెపోటుతో మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో  తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఈ దారుణ ఘటన జరిగింది. మహిళా భక్తురాలు సర్వదర్శనం క్యూలైన్‌లో స్వామివారి దర్శనానికి వెళ్తుండగా హటాత్తుగా క్యూ లైన్ లో కుప్పకూలింది. దీంతో సమీపంలోని భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సీపీఆర్ చేసినా ఆమె కోలుకోలేదు. అంబులెన్స్ లో ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మరణించింది.

మృతురాలు  కడపకు చెందిన 32 ఏళ్ల ఝాన్సీ అని ఆమె లండలో స్థిరపడినట్లు గుర్తించారు. స్వామి వారి దర్శనానికి వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లి ఝాన్సీని చూస్తూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో సకాలంలో వైద్యం అందలేదని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఝాన్సీకి కవల పిల్లలు ఉన్నారని ఇప్పుడు వారి పరిస్థితి ఏమి అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తునారు. క్యూ లైన్ లో కనీసం ఫోన్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు టిటిడి అధికారులు నిర్లక్ష్యం వల్లనే తమ కూతుర్ని కోల్పోయామని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.  ఝాన్సీ మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..