ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలపై నేరాలు ఆగడం లేదు. విజయవాడ, రేపల్లె ఘటనలు మరవకముందే శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన బాలింతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. అంతకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు 7 నెలల క్రితం బాబు పుట్టాడంతో పది రోజుల క్రితం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది. అప్పటికే అక్కడికి చేరుకున్న దుండగులు ఆమెపై దాడి చేశారు. 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. అక్కడా లేకపోవడంతో సమీపంలో గాలించగా.. తల పూర్తిగా ఛిద్రమై విగత జీవిగా పడి ఉన్న బాలింత మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. బండరాళ్లతో దారుణంగా కొట్టి, హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ హత్య ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముందస్తు పథకంలో భాగంగానే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. చంపడానికి ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
WhatsApp Tips: వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఇలా ట్రై చేయండి..!
Amit Shah: డిజిటల్ పద్దతిలో జన గణన.. 2024 తర్వాత ఆ అవసరమే ఉండదు: హోంమంత్రి అమిత్ షా