Andhra Pradesh: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

|

Jun 15, 2024 | 10:07 PM

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావులేకుండా రాష్ట్రంలో ఈ స్కీమ్ ప్రవేశ పెడతామని ఆయన వెల్లడించారు.

Andhra Pradesh: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన
APSRTC
Follow us on

ఏపీలో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. త్వరలోనే RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కంటిన్యూ అవుతున్నందుకున… మరింత లోతుగా అధ్యయనం, విశ్లేషణ చేసి ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లకు తావులేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పెడతామన్నారు.  దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.

అయితే ఇప్పటికే ప్రభుత్వ RTC బస్సులో రోజూ ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు? వీరికి ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే గవర్నమెంట్‌పై ఎంత భారం పడుతుంది? అనే విషయాలపై… అధికారులు రిపోర్ట్ రెడీ చేసినట్లు సమాచారం. అలాగే, తెలంగాణలో ఈ స్కీమ్ అమలు చేసిన మొదట్లో ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. చాలా ప్రాంతాల్లో నిరసనలు కూడా తెలిపారు.  ఈ స్కీమ్ ద్వారా తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళనలు చేపట్టారు. దీంతో వారికీ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ స్కీమ్ అమలు చేసేలా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…