ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది.. అంతలోనే ఏమైందో.. ఏమో.. ఆ అబ్బాయి మాత్రం ఆమెను వద్దన్నాడు.. నిశ్చితార్థం జరిగిన తర్వాత సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు.. ఆ తర్వాత ఇంతకుముందే పెళ్లి జరిగిన ఓ వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని.. మనువాడాడు.. తీరా.. వారానికే ఆమెను వదిలిపెట్టాడు.. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. గుడికల్ గ్రామానికి చెందిన ప్రవీణ అనే అమ్మాయికు రెండు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అయితే, అదే గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తికి అప్పటికే పెళ్లైంది.. భార్యను వదిలిపెట్టాడు.. అతని కన్ను ప్రవీణపై పడింది.. ప్రవీణను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు.. గతంలోనే అజయ్ కు వేరే మహిళతో వివాహం జరిగినా.. అది చెప్పకుండా ప్రవీణకు మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత.. వారం రోజులపాటు ప్రవీణతో కలిసి కాపురం చేశాడు.. ఆ తర్వాత మాయమాటలు చెప్పాడు.. బాబాయ్ ఇంటికి వెళ్లి అక్కడ ఉండు రెండు రోజుల్లో వస్తానని ప్రవీణకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడు.
అయితే.. రెండు నెలలైనా అజయ్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రవీణ ఇంటికి వెళ్లి చూడగా భర్త ఇంటికి తాళం వేసిన విషయాన్ని తెలుసుకొని తాను మోసపోయానని అర్థం చేసుకుంది.. న్యాయం కోసం పోలీసులు ఆశ్రయించింది.. అయినా వారు పట్టించుకోలేదు.. పోలీసుల ఎదుట గోడును వెళ్లబోసుకున్నా.. ఫలితం లేకపోవడంతో, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది.
ఒకపక్క తల్లిదండ్రులు ప్రవీణను రానియకపోవడం.. మరోవైపు భర్త వదిలేసి వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతోంది ప్రవీణ.. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో భర్త ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ప్రవీణ ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..