Wonder Kid: చిన్నాడో కాదు.. చిచ్చర పిడుగు.. ఒక్కసారి తెలిసిందంటే ఇక అంతే..

|

Sep 08, 2021 | 6:13 AM

Wonder Kid: ఒక్కసారి చెబితే చాలు అపర జ్ఞాపక శక్తి ఈ బాలుడి సొంతం.. ఆరు అంకెల సంఖ్య చెప్పాలంటే కొంచెం ఆలోచించాలి.. ఆపై ఒక అంకె పెరిగినా ఒకట్లు పదులు వందలు వేలు లక్షలు

Wonder Kid: చిన్నాడో కాదు.. చిచ్చర పిడుగు.. ఒక్కసారి తెలిసిందంటే ఇక అంతే..
Wonder Kid
Follow us on

Wonder Kid: ఒక్కసారి చెబితే చాలు అపర జ్ఞాపక శక్తి ఈ బాలుడి సొంతం.. ఆరు అంకెల సంఖ్య చెప్పాలంటే కొంచెం ఆలోచించాలి.. ఆపై ఒక అంకె పెరిగినా ఒకట్లు పదులు వందలు వేలు లక్షలు అంటూ లెక్కగట్టి చెబుతాం అది కూడా కొంత వరకే.. కానీ, కొవ్వూరు పట్టణానికి చెందిన ఐదేళ్ల బాలుడు డోలా కృష్ణ అనే బుడతడు మాత్రం..150 అంకెల సంఖ్యను సైతం రాకెట్ వేగంతో చెప్పగలడు. చిరు శోధనగా మొదలై ఎవరూ అనుకోని రీతిలో జ్ఞాపకశక్తిని సొంతం చేసుకున్నాడు ఈ బుడ్డోడు.

ఈ బాలుడికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సత్యవతి నగర్ కు చెందిన డోలా కృష్ణ తండ్రి శ్రీనివాస్ ఓ ప్రైవేట్ పాఠశాలలో లెక్కల టీచర్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాది మార్చి నెలలో కృష్ణ ను స్థానికంగా ఓ పాఠశాలలో చేర్చారు. కరోనా నేపథ్యంలో పట్టుమని పది రోజులు కాకుండానే స్కూల్ కి సెలవులు ఇచ్చారు. అంతే ఆ చిన్నోడు ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే.. ఓసారి ఏదో ఛానల్లో ఒక కుర్రాడు పంతొమ్మిది అంకెల సంఖ్యను చెప్పడం చూసిన శ్రీనివాస్.. కృష్ణకు ఆ విషయాన్ని చెప్పాడు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ యాప్‌లో డబ్బులు పంపేటప్పుడు వందలు పంపాలంటే మూడు అంకెలు, వేలు పంపాలంటే నాలుగు అంకెలు ఉంటాయని తెలియజేశారు. అలా మొదలైన ప్రస్థానం 21,50,100, అలా పెరుగుతూ 150 సంఖ్యలు చెప్పే స్థాయికి వచ్చింది.

ఒక్కసారి చెప్తే చాలు..
ఇదే అలవాటుతో ఏదైనా ఒక సారీ చెప్తే చాలు.. ఎప్పుడు అడిగినా టక్ మని చెప్పడం కృష్ణ కు అలవాటయిపోయింది. అంకేలు చెప్పడంతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఎంతో అవసరమని గుర్తించిన తండ్రి శ్రీనివాస్ ప్రపంచ దేశాలకు చెందిన ఎన్నో విషయాలను చెప్పారు. రెండు రోజుల తర్వాత తండ్రి అడగగా అవన్నీ గుర్తుపెట్టుకుని తిరిగి చెప్పడంతో ఆసక్తి రెట్టింపయింది. ప్రపంచ దేశాల పేర్లు, రాష్ట్ర రాజధానులు ముఖ్యమంత్రుల పేర్లు ఇట్టే చెప్తున్నాడు. కాగా, తాను ఎప్పటికైనా సిఐడి అధికారిని అవుతానని ముద్దుముద్దుగా చెప్తున్నాడు ఈ బాలుడు.

అవార్డుల మీద అవార్డులు..
నాలుగు రికార్డులు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో డోలా కృష్ణ అంకెలు చెప్పే విధానాన్ని చిత్రీకరించి ఐ రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హైదరాబాద్ కి పంపించారు. ఇప్పటివరకు 21 అంకెలు చెప్పడమే రికార్డులో ఉన్న నేపథ్యంలో ఈ వీడియోను న్యాయ నిర్ణేతలు బెంగళూరులోని గణిత నిపుణులకు పంపారు. ఆన్‌లైన్‌ విధానంలో న్యాయ నిర్ణేతలు వారం తర్వాత పరీక్ష పెట్టి అవార్డు ప్రకటించారు. ఇటీవల పంజాబ్ వరల్డ్ ఎక్సెలె‌న్స్ వరల్డ్ రికార్డ్, కలం వరల్డ్ రికార్డ్స్ కింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ చెన్నై, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ది వరల్డ్ ఢిల్లీ సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారానే బాలుడి ప్రతిభను గుర్తించి అవార్డు ప్రకటించాయి.

Also read:

Traffic Challan: టీవీ9 ఎఫెక్ట్.. ట్రాఫిక్‌ చలాన్లపై స్పందించిన జనగామ కలెక్టర్‌.. పెండింగ్ చలాన్లు క్లియర్..!

Hyderabad: ఘరానా మోసం.. ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ చేయిస్తానన్న దొంగబాబా.. 80వేలు సమర్పించుకున్న ఎంబీబీఎస్ స్టూడెంట్..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు..