AP Weather: ఓర్నీ.. ఏపీని ఇంకా వీడని వానలు.. మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్.. ఈ ప్రాంతాలపై ప్రభావం

|

Nov 25, 2022 | 6:30 PM

ఇటీవల నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్లు చిరు జల్లులు పడుతున్నాయి.

AP Weather: ఓర్నీ.. ఏపీని ఇంకా వీడని వానలు.. మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్.. ఈ ప్రాంతాలపై ప్రభావం
Andhra Pradesh Weather Report
Follow us on

కురిసిన వానల తాలూకా వ్యధలే ఇంకా పోలేదు. ఈలోపే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది.  ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి.. క్రమంగా బలపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ  వెల్లడించింది. కాగా విశాఖతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో శుక్రవారం చెదురుమదురు జల్లులు పడ్డాయి. సామర్లకోట, బాపట్ల ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. ఇక విజయవాడలో ఆకాశం మేఘావృతం అయి ఉంది.  సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ వెదర్‌మేన్ తెలిపాడు.

ఇక  దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక అమరావతి వాతావరణ కేంద్రం రిలీజ్ చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం.. శుక్రవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం