AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాల్లో అకాల వర్షాలు.. వాతావరణ శాఖ లేటెస్ట్ బులిటెన్ ఇదే

ఏపీలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని వివరించింది. వెదర్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ మీ కోసం.

AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాల్లో అకాల వర్షాలు.. వాతావరణ శాఖ లేటెస్ట్ బులిటెన్ ఇదే
Andhra Weather Report

Updated on: Apr 21, 2023 | 1:57 PM

సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి / గాలి కోత ఇప్పుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా వెళుతున్నది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణము లో దక్షిణ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

————————————————–

శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

ఆదివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రత ల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

———————–

శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు.

శనివారం :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది

ఆదివారం:-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రత ల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది

 

రాయలసీమ :-

—————-

శుక్రవారం, శనివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రత ల కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us