CM Jagan: డబుల్ సెంచరీ కొట్టేందుకు మేమంతా సిద్ధం.. మదనపల్లె బహిరంగ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు

|

Apr 02, 2024 | 6:54 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రజాగళం పేరుతో జనాల్లోకి వెళ్లగా, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు. గత నెల 27న మొదలైన జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు.

CM Jagan: డబుల్ సెంచరీ కొట్టేందుకు మేమంతా సిద్ధం.. మదనపల్లె బహిరంగ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు
Cm Jagan Meeting
Follow us on

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రజాగళం పేరుతో జనాల్లోకి వెళ్లగా, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు. గత నెల 27న మొదలైన జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇవాళ్ల చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఛలోక్తులతో, పంచులతో, ప్రాసాలతో కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని, అధికారం కోసం తోడేళ్ల గుంపులా వస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. జెండాలు జతకట్టడమే వారి పని అయితే, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే నా పని అంటూ కూటమినుద్దేశించి సీఎం జగన్ అన్నారు. ఒక్కడిపై ఇంత మంది దాడి చేస్తున్నారని, చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ కలిసి..నన్ను ఓడించడానికి ఏకమవుతున్నారని, ఇదంతా ఏపీ ప్రజలు గమనిస్తున్నారని సీఎం అన్నారు.

 

విశ్వసనీయత లేని కూటమి నిలబడుతుందా అని జగన్ ప్రశ్నిస్తూ.. 99 మార్కులు వచ్చిన విద్యార్థి పరీక్షలకు భయపడతాడా అంటూ తనదైన స్టైల్ లో ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. 99శాతం వాగ్ధానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు..10 శాతం వాగ్ధానాలు నెరవేర్చని చంద్రబాబు నిలబడగలరా అంటూ ఏపీ ప్రజలను ప్రశ్నించారు. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు అంతా సిద్ధమా అంటూనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలవాలని అని సిద్ధం సభ వేదికగా జగన్ ఏపీ ప్రజలను వేడుకున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.