Andhra: ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలొచ్చే.. భోగాపురంలో ఫస్ట్‌ వ్యాలీడేషన్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ అప్పుడే.!

ఎన్నాళ్లో వేచిన స్వప్నం సాకారం కాబోతుంది, భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో ఫస్ట్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యే సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విమానయాన శాఖ శుభసందేశాన్ని అందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీ లుక్కేయండి మరి.

Andhra: ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలొచ్చే.. భోగాపురంలో ఫస్ట్‌ వ్యాలీడేషన్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ అప్పుడే.!
Bhogapuram International Airport

Updated on: Jan 02, 2026 | 12:11 PM

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది, రన్‌ వే, ఏటీసీ సెంటర్లు పూర్తయ్యాయి. ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈనెల 4న ఢిల్లీ నుంచి భోగాపురంలో ఫస్ట్‌ వ్యాలీడేషన్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ కాబోతుంది. కేంద్ర విమానాయన మంత్రి రామ్మోహన్‌ నాయుడు సహా పలువురు ప్రముఖులు అదే ఫ్లైట్‌లో భోగాపురం రానున్నారు. అదీ సంగతి.నిర్దేశిత గడువు జూన్‌ కన్నా ముందే భోగాపురం ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది.పనులు అలా జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్నాయి. రన్ వే, ఏటిసి సెంటర్లు, టెర్మినల్ బిల్డింగ్‌ , ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్ , రాడార్ సిగ్నల్స్ ఇలా ATC వ్యవస్థలన్నీ దాదాపు పూర్తయ్యాయి.

2వేల 2వందల ఎకరాలు.. 4వేల 750 కోట్ల వ్యయంతో భోగాపురం ఎయిర్‌పోర్టును తొలి ఇంట్రిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌, ఇన్నోవేషన్‌ హబ్‌గా మారనుంది. ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా ఇక్కడ తొలి ఏవియేషన్‌ ఎడ్యుకేషన్‌ సిటీని డెవలప్‌ చేస్తున్నారు,. ఉత్తరాంద్రకు వరంగా..భారతావనికి తలమానికంగా భోగాపురం ఎయిర్‌పోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగే సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది భోగాపురం ఎయిర్‌పోర్ట్‌. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు మొదలు కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి