AP News: మందు కొట్టి బండెక్కితే.. ఆ డ్యూటీ చేయాల్సిందే..! డ్రింకర్ల బెండు తీస్తున్న పోలీసులు

|

Jun 02, 2022 | 4:56 PM

Visakhapatnam: సిటీలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 33మంది పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.

AP News: మందు కొట్టి బండెక్కితే.. ఆ డ్యూటీ చేయాల్సిందే..! డ్రింకర్ల బెండు తీస్తున్న పోలీసులు
Vizag Police
Follow us on

Vizag News: వాళ్ళంతా నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో సమానంగా డ్యూటీ చేస్తున్నారు. యూనిఫాం లేకపోయినా.. చేతిలో ప్లకార్డు మాత్రం ఉంటుంది..! ‘‘Dont drink amd drive’’ మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరం.. అంటూ రోడ్లపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకీ వాళ్ళంతా సంఘ సేవకులు కాదు.. మరి వీళ్ళు ఎవరు..? వీరి బెండు తీయించిన అసలు కథేంటి అనే కదా..? అయితే అసలు విషయం తెలుసుకోండి.. విశాఖపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిత్యం పెరిగిపోతున్నాయి. సాధారణ సమయాల్లో సరే సరి..! వీకెండ్లో అయితే మరీ దారుణం. తప్పతాగి వాహనాలపై ఎక్కి ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలు పైకి తెస్తున్నారు. మరికొంతమంది వారి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు.

సిటీలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 33మంది పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో వారికి జరిమానా కు బదులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే చెడు ప్రభావాలను ప్రచారం చేస్తూ కూడళ్ళలో అవగాహన కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.

Ap Police

తప్ప తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి ఈ విధంగా సామాజిక సేవ చేయాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 33 మందికి నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు పట్టుకుని నిలుచున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు మూడు గంటల పాటు సామాజిక సేవ చేశారు.

ఇవి కూడా చదవండి

Drunk And Drive

‘Dont drink amd drive, మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరం’ అంటూ రోడ్ల పై ప్రచారం చేశారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు పోలీసులు.

మందుబాబులు జర జాగ్రత్త..! తాగి వాహనం నడిపే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సారికి ఇలా.. మరోసారి బొట్టు పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తాగిన తర్వాత వాహనాలు జోలికి వెళ్లకపోవడమే మంచిది మరి.

-ఖాజా, టీవీ9 తెలుగు రిపోర్టర్, వైజాగ్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..