ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 15, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌లో పోస్టు ద్వారా లేదా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.22,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.