హైటెక్ సిటీ 2.O.. వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం..

ఇండియాకు ఎకనమిక్‌ ఇంజిన్‌.. ఫైనాన్శియల్ క్యాపిటల్ ముంబై సిటీ. దేశంలోని చాలా నగరాలు ఇండియన్ జీడీపీకి తమ వంతు సపోర్ట్‌ ఇస్తున్నా ముంబై లాంటి మరో ఎకనమిక్‌ ఇంజిన్‌ అవసరం అని ఆర్థిక నిపుణులు వెతికినప్పుడు, విశాఖ మీదే పడింది ఫోకస్..

హైటెక్ సిటీ 2.O.. వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం..
Google Data Center in Vizag

Updated on: Apr 28, 2026 | 9:50 PM

దేశం ఆర్థికంగా గట్టిగా నిలబడాలంటే, ప్రపంచం ముందు తలెత్తుకు తిరగాలంటే నగరాలే వెన్నెముకలు. ఈ దిశగా ఆలోచించిన కేంద్రప్రభుత్వం గ్రోత్‌ హబ్స్ పాలసీని తీసుకొచ్చింది. నీతి ఆయోగ్ స్పాన్సర్ చేస్తున్న గ్రోత్‌ హబ్స్ జాబితాలో 4 నగరాలను పిక్ చేసుకుంది కేంద్రం. దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక నగరం ఏదో గెస్ చెయ్యగలరా? ఏ చెన్నైయో, ఏ బెంగళూరో కాదు- ఆ క్రెడిట్ దక్కించుకుంది మన విశాఖపట్నమే. భారీగా పైసలిచ్చి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలన్నది మోదీ సర్కార్ సంకల్పం. కూటమి సర్కార్ పవర్లోకొచ్చిన తర్వాత ఆ సంకల్పం మరింత గట్టిపడింది. ఆ విధంగా పెట్టుబడులక్కూడా స్వర్గధామం కాబోతోంది వైజాగ్ సిటీ. పదేళ్లలో వైజాగ్‌ సిటీకి మహర్దశ పట్టి, హైజాగ్ సిటీగా మారిపోవడం పక్కా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్లారిటీని కొద్దికొద్దిగా బలపరుస్తూ మరిన్ని ల్యాండ్‌మార్క్స్‌ రాసుకుంటూ దూసుకుపోతోంది విశాఖ నగరం. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ… మనకున్న 53 యూనివర్సిటీలకూ దిక్సూచిలాంటిది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి అసెంబ్లీ సమావేశాలకూ కేరాఫ్ ఇదే అంటూ ఏయూ వందేళ్ల పండగలో రీకాల్ చేసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాక విశాఖ గర్వకారణాల్లో మరొకటి. సో, చరిత్రకు, వారసత్వ సంపదకే కాదు, అధునాతన టెక్నో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి